Meta: మెటా ఉద్యోగులకు జుకర్‌బర్గ్ భారీ షాక్.. 3600 మంది ఉద్యోగులకు ఉద్వాసన

Meta To Fire Approximately 3600 Employees

  • తక్కువ పనితీరు కలిగిన 3,600 మంది ఉద్యోగుల గుర్తింపు
  • వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటామన్న జుకర్‌బర్గ్
  • కంపెనీలో పనితీరు ఆధారిత కోతలు ఉంటాయని స్పష్టీకరణ

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. వీరు అంతగా పనితీరు కనబరచలేకపోతున్నారని గుర్తించిన మెటా వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే మెటాలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిపై వేటు పడనుంది. గతేడాది సెప్టెంబర్ నాటికి మెటాలో దాదాపు 72,400 మంది పనిచేస్తున్నారు.

తక్కువ సామర్థ్యం కలిగిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా వెల్లడించారు. కంపెనీలో పనితీరు ఆధారిత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. కంపెనీ ‘బలమైన ప్రతిభ’ కలిగి ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులను తీసుకొస్తామని చెప్పారు. పనితీరు ఆధారిత కోతలు అమెరికా కంపెనీల్లో సర్వసాధారణమే. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. తమ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఒక శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు గతవారం ప్రకటించింది.   

  • Loading...

More Telugu News