Venkatesh: థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది... రియాక్షన్స్ జెన్యూన్ గా ఉన్నాయి: వెంకటేశ్

Venkatesh speech at Sankarnthiki Vastunnam success meet

  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
  • పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందంలో జోష్
  • సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్

విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పేరుకు తగ్గట్గుగానే ఈ చిత్రం నేడు (జనవరి 14) సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వెంకటేశ్ మాట్లాడుతూ, 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో తన కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. 

"అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్ కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం ఎంతో చక్కని అనుభూతిని అందిస్తుంది. 

సినిమాకి ప్రతి థియేటర్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా వున్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా వుంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా వుంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్" అని వెంకటేశ్ పేర్కొన్నారు.

More Telugu News