Sankranti Treat: ఇవన్నీ తినడం జరిగే పనేనా... 465 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు
- యానాంలో ఓ కొత్త అల్లుడికి అదిరిపోయే విందు
- వందలాది వంటకాలు చూసి కాస్తంత సిగ్గుపడిన కొత్త అల్లుడు
- వీడియో వైరల్
ఇటీవల కాలంలో కొత్త అల్లుళ్లకు వందల రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం కామన్ గా మారింది. ఇటీవల కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణకు చెందిన అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఇప్పుడీ రికార్డు బద్దలమైంది.
యానాంకు చెందిన ఓ కుటుంబం తమ ఇంటి కొత్త అల్లుడికి ఏకంగా 465 రకాల వంటకాలతో భోజనం పెట్టి చరిత్ర సృష్టించింది. అసలా వంటకాలన్నీ చూసిన తర్వాత... ఇవన్నీ అతగాడు తినడం జరిగే పనేనా అనిపించకమానదు.
యానాంకు చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ మాజేటి సత్యభాస్కర్ కుమార్తె హరిణికి, విజయవాడ ఇండస్ట్రియలిస్టు సాకేత్ తో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి సత్యభాస్కర్ కుటుంబం చిరకాలం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇచ్చింది. వందల వంటకాలు కళ్లముందు కనిపిస్తుంటే, తినడానికి ఆ కొత్త అల్లుడు కాస్తంత సిగ్గుపడిపోవడం వీడియోలో కనిపించింది.
ఆ వంటకాల్లో శాకాహార, మాంసాహార వంటకాలు, స్వీట్ అండ్ హాట్, ఫ్రూట్స్, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు... ఇలా రకరకాల డిషెస్ ఉన్నాయి.