Chandrababu: నారావారిపల్లెలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన
- సంక్రాంతి పండుగకు సొంతూరు వచ్చిన సీఎం చంద్రబాబు
- కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా వేడుకలు
- ఈ సాయంత్రం విజయవాడకు తిరుగుపయనం
సీఎం చంద్రబాబు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సొంతూరు నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల నడుమ ఆయన సంక్రాంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
కాగా, నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన ఈ సాయంత్రంతో ముగిసింది. ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. నారావారిపల్లెలో తన పర్యటన సందర్భంగా చంద్రబాబు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.