Padi Kaushik Reddy: పతంగ్ ఎగరేస్తూ వీడియో... సీఎం రేవంత్ రెడ్డికి సంక్రాంతి విషెస్ తెలిపిన కౌశిక్ రెడ్డి
- బెయిల్ పై బయటికొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- తన ఇంటిపై ఉత్సాహంగా పతంగులు ఎగరేసిన వైనం
- హ్యాపీ సంక్రాంతి సీఎం రేవంత్ రెడ్డి గారూ అంటూ క్యాప్షన్
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తోపులాట జరగడం... సంజయ్ ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఆయనను అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఇవాళ కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో, బయటికొచ్చిన కౌశిక్ రెడ్డి ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా... తన ఇంటిపై పతంగులు ఎగరేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హ్యాపీ సంక్రాంతి సీఎం రేవంత్ రెడ్డి గారూ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
కౌశిక్ రెడ్డి కళ్లకు సన్ గ్లాసులు పెట్టుకుని, ఎంతో ఉత్సాహంగా పతంగ్ ఎగరేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.