Daggubati Purandeswari: చీరాలలో డాకు మహారాజ్ సినిమా చూసిన పురందేశ్వరి
- సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్
- మరో హిట్ కొట్టిన బాలయ్య
- పండుగ రోజున తన సోదరుడి సినిమా చూసిన పురందేశ్వరి
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, తన సోదరుడు బాలకృష్ణ నటించిన ఈ చిత్రాన్ని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నేడు చీరాలలో వీక్షించారు.
తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ చీరాల వచ్చిన పురందేశ్వరి... ఇక్కడి మోహన్ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా చూశారు. ఎంచక్కా పాప్ కార్న్ తింటూ బాలయ్య మూవీని ఆస్వాదించారు.
సినిమా అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో సామాజిక, సందేశాత్మక అంశాలున్నాయని తెలిపారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. డాకు మహారాజ్ చిత్రబృందానికి పురందేశ్వరి అభినందనలు తెలియజేశారు.