Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ మంచి అనుభూతినిచ్చింది: నితీశ్ కుమార్ రెడ్డి
- ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి
- తాజాగా కాలినడకన తిరుమల కొండెక్కిన తెలుగు క్రికెటర్
- మరింత మంది ఏపీ క్రికెటర్లు జాతీయజట్టుకు ఆడాలని ఆకాంక్ష
ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నాడు. అనంతరం, తిరుపతి క్రికెటర్లను కలిసి ముచ్చటించాడు.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మంచి అనుభూతిని అందించిందని అన్నాడు. త్వరలో ఇంగ్లండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. మన రాష్ట్రం నుంచి మరింత మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంటున్నానని తెలిపాడు.