Upasana Konidela: ఫ్యామిలీతో కలిసి చెర్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్... ఫొటో షేర్ చేసిన ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో ఉన్న ఫొటోను ఉపాసన షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు అని ఉపాసన పేర్కొన్నారు. దీంతో మెగా కోడలి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు వారికి శుభకాంక్షలు చెబుతున్నారు.
ఇదిలాఉంటే... ఈ నెల 10న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట డివైడ్ టాక్ వచ్చిన ఈ మూవీ.. ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ పండక్కి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే చిత్రంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.