Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్‌'తో బాల‌య్య అరుదైన ఫీట్‌... ఏ తెలుగు హీరోకు సాధ్యంకాని ఘ‌న‌త‌!

Balakrishna Bercomes One And Tollywood Only Hero Feat With Daaku Maharaaj

  • బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబోలో డాకు మహారాజ్‌
  • ఈ నెల‌ 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన సినిమా
  • తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.56 కోట్లు వసూళ్లు రాబ‌ట్టిన మూవీ
  • అటు యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద 1మిలియ‌న్ డాలర్ మార్క్
  • అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి తర్వాత మిలియన్ మార్క్ చేరుకున్న నాలుగో చిత్రం
  • అమెరికాలో వరుసగా 4 సినిమాలు మిలియన్‌ మార్క్ సాధించిన ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య‌

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం డాకు మహారాజ్‌. ఈ చిత్రం ఈ నెల‌ 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక మొద‌టి ఆట నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా డాకు మహారాజ్‌కు భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 

ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.56 కోట్ల వసూళ్లు (గ్రాస్‌) రాబ‌ట్టిన‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో బాలయ్య‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచిందని మేకర్స్ ప్ర‌క‌టించారు.

ఇదిలాఉంటే... ఇప్పటికే డాకు మహారాజ్‌ యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.6.50 కోట్లు (1 మిలియ‌న్ డాలర్) మార్క్ ను అందుకుంది. దీంతో బాల‌య్య న‌టించిన‌ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాల తర్వాత మిలియన్ డాలర్ మార్క్ చేరుకున్న నాలుగో సినిమాగా నిలిచింది. 

ఇలా అమెరికాలో వరుసగా నాలుగు సినిమాలు మిలియన్‌ డాలర్‌ మార్క్ సాధించిన ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ క్రేజీ వార్త ఇప్పుడు బాల‌కృష్ణ‌ అభిమానుల్లో జోష్ నింపుతోంది. 

  • Loading...

More Telugu News