Hari Hara Veeramallu: సంక్రాంతి స్పెషల్... పవన్ 'వీరమల్లు' పాట ప్రోమో చూశారా?
- పవన్ కల్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో 'హరిహర వీరమల్లు'
- మూవీలోని ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' అంటూ సాగే పాట ప్రోమో విడుదల
- ఈ సాంగ్‌ను స్వయంగా ఆలపించిన పవన్ కల్యాణ్
- ఈ నెల 17న పూర్తి పాట రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి సంక్రాంతి కానుకగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' అంటూ సాగే పాట ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
కాగా, ఈ పాటను స్వయంగా పవన్ ఆలపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో వీరమల్లు మాట వినాలి... అంటూ పవన్ గొంతు అందరిలో జోష్ నింపుతోంది.
ఈ పాటను ఈ నెల 6న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ, వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి, పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.