Chiranjeevi: అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చిరు... స‌రికొత్త అవ‌తార్‌లో ద‌ర్శ‌నం

Megastar Chiranjeevi Sankranti Whishes to All

  


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు సంక్రాంతి కానుకగా ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెష‌ల్ పోస్టు పెట్టారు. ఇక చిరుకు సంబంధించిన కొత్త ఫొటోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వాటిలో మెగాస్టార్ స‌రికొత్త అవ‌తార్‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు.     
"ముంగిళ్లలో అందమైన రంగవల్లులు... లోగిళ్లలో ఆనందపు వెలుగులు... జంగమ దేవరుల జేగంటలు... హరిదాసుల కీర్తనలు... భోగ భాగ్యాలు, సిరి సంపదలూ... వెరసి అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లి విరియాలని ఆశిస్తూ... అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!" అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

More Telugu News