Rohit Sharma: రంజీ ప్రాక్టీస్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ... వీడియో ఇదిగో!
- ఇటీవల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్
- బీజీటీ సిరీస్ లోనూ ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్
- దీంతో తిరిగి ఫామ్‌ను అందుకునే దిశగా రోహిత్ చర్యలు
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో తనకు తానుగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో తిరిగి ఫామ్‌ను అందుకునే దిశగా హిట్‌మ్యాన్ చర్యలు చేపట్టాడు. దీనిలో భాగంగా ముంబయి జట్టుతో కలిసి వాంఖేడే స్టేడియంలో రంజీ ట్రోఫీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ సెషన్ తనకు ఉపయోగకరంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. అయితే, ముంబయి రంజీ జట్టు తరఫున రోహిత్ బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రాక్టీస్ సెషన్ కోసం హిట్‌మ్యాన్ వాంఖేడే మైదానానికి వెళుతున్న వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు, టీమిండియా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.