AP Govt: పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
- ఈ ఏడాది ప్రారంభం నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఫోకస్
- ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా..పెండింగ్ బిల్లుల చెల్లింపులపైనే చంద్రబాబు సర్కార్ దృష్టి
- గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను ప్రణాళికా బద్దంగా జమ చేస్తున్న ప్రభుత్వం
- ఇలా 2025 జనవరి నెలలోనే ఇప్పటివరకు సుమారు రూ. 8 వేల కోట్ల చెల్లింపులు
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపులపైనే ఫోకస్ పెట్టింది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా..పెండింగ్ బిల్లుల చెల్లింపులపైనే చంద్రబాబు సర్కార్ దృష్టిసారించింది.
పెండింగ్ బిల్లులపై ఎప్పటికప్పుడు సీఎంకు మంత్రి పయ్యావుల డీటైల్ట్ నోట్ ఇస్తున్నారు. వివిధ వర్గాలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం జమ చేస్తోంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది. ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిల చెల్లింపులతో ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందాయి. ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లింపులు కూడా చేసింది.
అమరావతి రైతులకు కౌలు చెల్లింపులను సైతం సర్కార్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడ్డ వివిధ ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్ నిధులను విడుదల చేయడం జరిగింది. పెండింగ్ బిల్లుల క్లియరెన్సుతో ఒకేసారి 26 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఒడ్డున పడ్డారు. ఇలా 2025 జనవరి నెలలోనే ఇప్పటి వరకు సుమారు రూ. 8 వేల కోట్ల చెల్లింపులు చేసింది.
ఇందులో పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్ల, ఉద్యోగులకు చెల్లింపుల కింద రూ. 1300 కోట్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బిల్లు రూ. 788 కోట్లతో పాటు వివిధ వర్గాలకూ మరిన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేసింది.