Sankranthiki Vasthunam: ట్విట్టర్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం'కు పాజిటివ్ రివ్యూలు
- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'
- మరోసారి వెంకీమామ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయ్యిందంటున్న ప్రేక్షకులు
- దర్శకుడు మరోసారి తన టిపికల్ మార్క్ కామెడీతో నవ్వులు పూయించారట
- బ్లాక్‌బస్టర్ ఫన్‌రైడ్ అని, సినిమా అంతా ఫుల్ కామెడీ అంటూ రివ్యూలు
టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
ఈ సినిమాను ఎప్పటిలాగే దర్శకుడు అనిల్ రావిపూడి తన టిపికల్ మార్క్ కామెడీతో తెరకెక్కించారని.. ముఖ్యంగా వెంకీమామ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందట. మొత్తానికి ఈ పండక్కి థియేటర్లలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను అడియన్స్ ఎంజాయ్ చేయడం ఖాయమంటున్నారు.
ఈ సినిమాలో వెంకటేశ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెబుతున్నారు. ఐశ్వర్య రాజేశ్ కూడా చాలా బాగా నటించారని టాక్. ఇక భీమ్స్ అందించిన పాటలు సినిమాకు మరింత బలం అని అంటున్నారు. బ్లాక్‌బస్టర్ ఫన్‌రైడ్ అని, సినిమా అంతా ఫుల్ కామెడీ అంటూ పేర్కొంటున్నారు. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ అని చెబుతున్నారు.
ఇక విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. చిత్రబృందం ప్రమోషన్లలో సైతం విభిన్న టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించింది. ఈ పండక్కి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూసే సినిమా ఇది అని ఇటీవలే వెంకటేశ్ కూడా అన్నారు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు మూవీ పాటిజివ్ బజ్‌ను సొంతం చేసుకుంది.