The Raja Saab: సంక్రాంతి స్పెషల్.. ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి కొత్త పోస్టర్
- ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో 'రాజాసాబ్'
- మూవీ నుంచి ప్రభాస్ స్టైలిష్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్
- నెట్టింట వైరల్ అవుతున్న 'రాజాసాబ్' కొత్త పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. "హ్యాపీ సంక్రాంతి డార్లింగ్స్.. మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం" అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత డార్లింగ్‌ను స్టైలిష్‌గా చూపించారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.