Cock Fight: సంక్రాంతి కోడి పందేల్లో బీరు సీసాలతో తలలు పగులగొట్టుకున్న యువకులు.. వీడియో ఇదిగో!
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే కృష్ణా జిల్లా కంకిపాడులో మాత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరాల వద్ద కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. రెండు గ్రామాల యువకుల మధ్య తలెత్తిన గొడవ చివరికి ఉద్రిక్తంగా మారింది. దీంతో రెచ్చిపోయిన యువకులు బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు యువకుల తలలు పగిలాయి.
గాయపడిన యువకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, పందెంలో ఓ గ్రామానికి చెందిన వారు ఓడిపోవడమే ఘర్షణకు కారణమని బాధితులు తెలిపారు. పదిమంది కలిసి మూకుమ్మడిగా తనపై దాడిచేసినట్టు బాధితుడు చెప్పాడు. తనపై దాడిచేసిన వారిలో కోళ్లకు కత్తులు కట్టే వ్యక్తి కూడా ఉన్నట్టు తెలిపాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు.