Marriage: కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడిన తండ్రి!

Father Married Girl Who Supposed To Be Son Wife

  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
  • కుమారుడికి పెళ్లి సంబంధం కుదిర్చిన తండ్రి
  • ఆ తర్వాత ఆమెతోనే ప్రేమలో పడిన వైనం 
  • ఒక రోజు రహస్యంగా ఆమెను పెళ్లాడి ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
  • పెళ్లిపై నమ్మకం పోయిందన్న పెళ్లి కొడుకు

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడో వ్యక్తి. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఓ అమ్మాయిని చూశాడు. కుమారుడికి కూడా అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల ఇళ్లలోనూ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. 

అయితే, ఆ తర్వాత జరిగిందో ట్విస్ట్. వన్ ఫైన్ డే.. పెళ్లి కొడుకు తండ్రి, వధువు ఇద్దరూ సైలెంట్‌గా ఓ గుళ్లో పెళ్లి చేసుకుని ఎంచక్కా ఇంటికొచ్చారు. తనకు కాబోయే భార్యతో పెళ్లి దుస్తుల్లో వచ్చిన తండ్రిని చూసి పెళ్లి కొడుకు నిర్ఘాంతపోయాడు. అటు పెళ్లి కుమార్తె ఇంట్లోనూ ఇలాంటి సీనే కనిపించింది. కోపంతో ఊగిపోయిన కుమారుడిని బుజ్జగించేందుకు మరో యువతిని వెతికి పెళ్లి చేస్తానని తండ్రి హామీ ఇచ్చినప్పటికీ అతడు నిరాకరించాడు. ఈ దెబ్బతో తనకు పెళ్లిపైనే నమ్మకం పోయిందని, సన్యాసిగా మారిపోతానని చెప్పుకొచ్చాడు.

More Telugu News