Yograj Singh: కపిల్‌దేవ్‌ను చంపేందుకు తుపాకితో ఆయన ఇంటికి యువరాజ్ తండ్రి యోగరాజ్.. ఆ తర్వాత జరిగింది ఇదీ!

Yograj Singh kaun hai Kapil Dev gives STINGING reply to Yograj

  • కపిల్ టీమిండియా కెప్టెన్ కాగానే తనను నార్త్‌జోన్, హర్యానా జట్ల నుంచి తప్పించారన్న యోగరాజ్
  • కపిల్‌ను చంపేందుకు పిస్టల్‌తో ఆయన ఇంటికి వెళ్లానన్న యువరాజ్ తండ్రి
  • తల్లితో కలిసి ఇంట్లోంచి బయటకు రావడంతో వెనక్కి తగ్గానన్న యోగరాజ్
  • కపిల్, బిషన్‌సింగ్ బేడీ వల్లే తన కెరియర్ నాశనమైందని ఆరోపణ
  • క్రికెట్‌లో రాజకీయాలకు బలైపోయానని ఆవేదన

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ అప్పట్లో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌ను కాల్చి చంపేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. యూట్యూబర్ సందీష్ భాటియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. జట్టు నుంచి తనను తప్పించగానే కపిల్‌ను చంపేందుకు పిస్టల్ తో ఆయన ఇంటికి వెళ్లినట్టు చెప్పాడు.

‘‘కపిల్‌దేవ్ భారత జట్టు కెప్టెన్ కాగానే ఎలాంటి కారణం లేకుండా నార్త్‌జోన్, హర్యానా జట్ల నుంచి నన్ను తొలగించారు’’ అని యోగరాజ్ గుర్తు చేసుకున్నాడు. ‘‘కపిల్‌తో గొడవ పడమని నా భార్య చెప్పింది. కానీ నేను మాత్రం అతడికి గుణపాఠం నేర్పాలనుకున్నాను. పిస్టల్ తీసుకుని సెక్టార్ 9లోని కపిల్ ఇంటికి వెళ్లాను. అప్పుడు కపిల్ తన తల్లితో కలిసి బయటకు రావడంతో నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు.

కపిల్‌దేవ్ ఇంటి బయట ఆయనతో గొడవ పడ్డానని, డజను సార్లు అతడిని దూషించానని యోగరాజ్ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ‘‘నీ వల్ల నేను సర్వస్వం కోల్పోయా. తుపాకితో నీ తల ఛిద్రం చేయాలని ఉంది. కానీ నేనా పని చేయలేను, ఎందుకంటే నీ తల్లి నీ పక్కన ఉంది, అని చెప్పి బయటకు వచ్చేశా’’ అని పేర్కొన్నాడు. కపిల్, బిషన్‌సింగ్ బేడీ వంటి వారు తనపై కుట్రలు చేశారని ఆరోపించాడు. క్రీడల్లో రాజకీయాలకు తాను బలైపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. 

యోగరాజ్ ఎవరు?
యోగరాజ్ కెరియర్ నాశనం కావడానికి మీరు కారణమని ఆయన ఆరోపిస్తున్నారని, మిమ్మల్ని చంపేందుకు తుపాకితో కూడా మీ ఇంటికి వచ్చానని ఆయన చెప్పారని, దీనిపై మీ స్పందనేంటన్న విలేకరుల ప్రశ్నకు కపిల్ కాసేపు స్థాణువులా వుండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని యోగరాజ్ ఎవరని ప్రశ్నించారు. విలేకరులు బదులిస్తూ యువరాజ్ సింగ్ తండ్రి అని చెప్పగానే.. అవునా? అని అన్నారు. 

More Telugu News