Telangana: కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

TG released guidelines for ration cards

  • ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులను జారీ చేయనున్న తెలంగాణ
  • మంత్రివర్గ సంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక
  • క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత రేషన్ కార్డుల జారీ

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. తాజా నిర్ణయంతో, ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు.

మండలస్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. రేషన్ కార్డు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి, చదివి వినిపించిన తర్వాత ఆమోదం లభిస్తుంది. 

  • Loading...

More Telugu News