Game Changer Special Show: తన పుట్టినరోజు వేళ చిన్నారుల కోసం 'గేమ్ చేంజర్' స్పెషల్ షో ఏర్పాటు చేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్

Delhi BJP Chief Virendra Sachdeva arrages Game Changer special show on his birthday

  • పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ బీజేపీ చీఫ్
  • పిల్లలతో కలిసి గేమ్ చేంజర్ సినిమా చూసిన వీరేంద్ర సచ్ దేవా
  • ఇది మధురమైన జ్ఞాపకం అంటూ ట్వీట్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన గేమ్ చేంజర్ చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. 

కాగా, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల కోసం ఢిల్లీలో గేమ్ చేంజర్ స్పెషల్ షో వేయించారు. వందలాది చిన్నారులతో కలిసి ఆయన గేమ్ చేంజర్ సినిమాను వీక్షించారు. దీనిపై వీరేంద్ర సచ్ దేవా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"పిల్లలు దేవతలతో సమానం. వారు దేవుడి ప్రత్యేక దూతలు. నా పుట్టినరోజు సందర్భంగా చిన్న పిల్లలతో కలిసి గేమ్ చేంజర్ సినిమా చూశాను. ఆ సినిమాను తెరపై చూస్తున్నంత సేపు ఆ పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషంతో కూడిన చిరునవ్వులు, ఉద్విగ్నతను నా జీవితాంతం నా జ్ఞాపకాల్లో పదిలంగా నిలుపుకుంటాను" అని వివరించారు.

  • Loading...

More Telugu News