Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Padi Koushik Reddy arrest

  • ఓ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడి వస్తుండగా అరెస్ట్
  • అరెస్ట్ చేసేందుకు కరీంనగర్ నుంచి వచ్చిన 35 మంది పోలీసులు
  • కరీంనగర్‌కు తీసుకువెళుతున్న పోలీసులు

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్‌లో తన ప్రసంగాన్ని అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News