Sanjay: కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తే... నేనూ చేస్తా: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

- బీఆర్ఎస్ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని విమర్శ
- పాడి కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించాడని ఆగ్రహం
- ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్న సంజయ్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, అందుకుగాను కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. అప్పుడే తానూ తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారని సంజయ్ విమర్శించారు. కౌశిక్ రెడ్డి స్వతహాగా చేశారా? ఎవరైనా రెచ్చగొడితే చేశారా? అనేది తెలియాలన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్నే ఎత్తిచూపుతూ నిన్న పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దాంతో, సమీక్ష సమావేశంలో, మంత్రుల ఎదురుగానే కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య ఘర్షణ జరిగింది.