Nara Devansh: నారావారిపల్లెలో సంక్రాంతి పోటీల్లో పాల్గొన్న నారా దేవాన్ష్

Nara Devansh enjoys village games in Naravaripalle

  • సొంతూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న నారా ఫ్యామిలీ
  • నేడు భోగి సందర్భంగా నారావారిపల్లెలో వివిధ పోటీలు
  • గ్రామీణ ఆటలను ఆస్వాదించిన దేవాన్ష్

సీఎం చంద్రబాబు కుటుంబం తమ స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటోంది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర బంధువులు నారావారిపల్లెలో సందడి చేస్తున్నారు.  

ఇవాళ భోగి పండుగ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పోటీల్లో నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు. గోనె సంచిలో కాళ్లు ఉంచి... దుముకుతూ వెళ్లే ఆటలో దేవాన్ష్ పార్టిసిపేట్ చేశాడు. ఈ పోటీని దేవాన్ష్ ఎంతగానో ఆస్వాదించాడు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు కూడా తిలకించారు. విజేతలకు వారు బహుమతులు అందించారు.

Nara Devansh
Sankranti
Naravaripalle
Chandrababu
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News