Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్' ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌!

56 Crore Worldwide Gross on First Day for Daaku Maharaaj Movie

  • బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో  'డాకు మ‌హారాజ్' 
  • నిన్న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన సినిమా
  • ఫ‌స్ట్ డే మూవీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 56 కోట్ల‌కు పైగా వసూళ్లు
  • ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ 'డాకు మ‌హారాజ్' సినిమా నిన్న‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాల‌య్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమా తొలి రోజు వ‌సూళ్ల‌ను నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తాజాగా ప్ర‌క‌టించింది. 

ఫ‌స్ట్ డే 'డాకు మ‌హారాజ్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 56 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. బాల‌య్య‌కు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చిత్ర యూనిట్ పేర్కొంది. 

కాగా, ఈ మూవీలో బాల‌కృష్ణ స‌ర‌స‌న‌ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వ‌శి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్‌ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 


More Telugu News