Telangana Dishes: ఆంధ్రా అల్లుడికి 130 రకాల తెలంగాణ వంటకాలతో విందు.. వీడియో ఇదిగో!

--
సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి తెలంగాణ అత్తమామలు అదిరిపోయే విందు ఇచ్చారు. ఏకంగా 130 రకాల వంటకాలను వండి వడ్డించి ఆంధ్రా అల్లుడిని సర్ ప్రైజ్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్ కు చెందిన క్రాంతి, కల్పన దంపతులు తమ అల్లుడికి ఈ విందు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రాంతి, కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. నాలుగు నెలల క్రింత పెద్దమ్మాయిని కాకినాడకు చెందిన మల్లికార్జున్ కు ఇచ్చి వివాహం చేశారు. తాజాగా సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుడికి తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని భారీగా వంటకాలు చేసిపెట్టారు. తెలంగాణ పిండి వంటలతో పాటు బగారా, పులిహోరా.. ఇలా 130 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను వడ్డించారు.