Balakrishna: 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీ.. యంగ్ హీరోలకు బాలయ్య ముద్దులు.. ఇదిగో వీడియో!

నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీ నిర్వహించింది. 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్సేన్ సందడి చేశారు.
ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ వీడియోను విష్వక్ 'ఎక్స్' (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఇందులో సిద్ధూ, విష్వక్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టడం ఉంది. వారు కూడా బాలకృష్ణపై తమ అభిమానాన్ని చాటుకోవడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.