Balakrishna: అభిమానులకు బాలయ్య ఫోన్ కాల్స్.. ఫోన్ కాల్ సంభాషణ ఆడియోలు నెట్టింట వైరల్!

- బాలయ్య, బాబీ కొల్లి కాంబోలో 'డాకు మహారాజ్'
- నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
- తన మూవీ ఎలా ఉందో అభిమానులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ
- తమ అభిమాన హీరోతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫ్యాన్స్
సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ ఆదివారం నాడు 'డాకు మహారాజ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య మరోసారి తనదైన యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగులు, ఎలివేషన్స్‌తో అలరించారని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే బాలకృష్ణను కొత్తగా చూపించడంలోనూ బాబీ సక్సెస్ అయ్యాడంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
ఇక ఎప్పటిలానే బాలయ్య తన మూవీ ఎలా ఉందో అభిమానులను అడిగి తెలుసుకున్నారు. తమ అభిమాన హీరోతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్‌ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో అభిమానులతో బాలకృష్ణ మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ఆడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"కంగ్రాట్స్ అన్న గారు.. సూపర్ ఉంది మూవీ. మీ నటన మాత్రం నట విశ్వరూపం. అసలు ఫస్టాఫ్ చాలా పీక్ అన్నగారు. సెకండాఫ్ సెటిల్ యాక్టింగ్ చాలా బావుంది. బాబీ గారి టేకింగ్, విజువల్స్ అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది మీ కెరీర్‌లో. తమన్ బీజీఎం వేరే లెవెల్. ఒన్ మ్యాన్ షో అన్నగారు మీది" అంటూ ఓ అభిమాని చెప్పగా బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. వెరీ గుడ్ సంతోషం. థాంక్యూ అమ్మా. మీకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అని విషెస్ తెలియజేశారు.
అనంతపురంలో తన డైహార్ట్ ఫ్యాన్‌తో కూడా బాలకృష్ణ మాట్లాడారు. "సినిమా అదిరిపోయింది.. హిందూపురానికి నీటి బాధని ఎలా అయితే తీర్చారో.. అదే స్క్రీన్‌పై కనిపించింది" అంటూ బాలయ్యని అభిమాని ప్రశంసించారు. అలాగే సక్సెస్ మీట్ అనంతపురంలోనే నిర్వహిస్తాం ఏర్పాట్లు చేసుకోండి అంటూ బాలయ్య ఆ ఫ్యాన్‌తో చెప్పడం ఆడియోలో ఉంది. ఇలా పలువురు అభిమానులతో బాలయ్య మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో వైరల్ అవుతున్నాయి.