Nara Lokesh: కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు మంత్రి నారా లోకేశ్

Nara Lokesh off to Naravaripalle along with his family
  • ప్రతి ఏటా సంక్రాంతి వేళ సొంతూరుకు నారా ఫ్యామిలీ
  • ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్
  • ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను తమ స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకుంటారు. పూర్తి సంప్రదాయబద్ధంగా భోగి, సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. 

చంద్రబాబు ఇప్పటికే తిరుపతి చేరుకోగా, మంత్రి నారా లోకేశ్ కూడా కుటుంబ సమేతంగా ఈ సాయంత్రం  హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చారు. ఇండిగో విమానంలో వచ్చిన లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాన్ష్ లు రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గం ద్వారా నారావారిపల్లె బయల్దేరారు. 

కాగా, లోకేశ్ కు ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు స్వాగతం పలికారు. కూటమి నేతలను చూడగానే లోకేశ్... బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు.
Nara Lokesh
Naravaripalle
Sankranti
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News