Padi Kaushik Reddy: కేసీఆర్ భిక్షతో గెలిచావు... దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి: సంజయ్ పై కౌశిక్ రెడ్డి ఫైర్

Kaushik Reddy fires on Sanjay

  • కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష
  • బాహాబాహీకి దిగిన కౌశిక్ రెడ్డి, సంజయ్
  • ఇద్దరినీ విడదీసిన మంత్రులు
  • అనంతరం మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మంత్రుల సమీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. అనంతరం సమావేశం నుంచి బయటికి వచ్చిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

కేసీఆర్ భిక్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్... కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాడని మండిపడ్డారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై జగిత్యాల మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. 

కేసీఆర్ ఇచ్చిన భిక్షతో గెలిచి ఇవాళ స్టేజి ఎక్కి మాట్లాడుతున్నావా... కడుపుకు అన్నం తింటున్నావా, లేక పెండ తింటున్నావా? నీకసలు సిగ్గు, శరం, మానం, లజ్జ ఉన్నాయా? అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సంజయ్ ని మాత్రమే కాదు, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలను రాబోయే రోజుల్లో ఎక్కడా తిరనివ్వబోమని హెచ్చరించారు.

Padi Kaushik Reddy
Sanjay
KCR
BRS
Congress

More Telugu News