Vishal: విశాల్ కోలుకున్నాడు.. వీడియో ఇదిగో!

- తన అనారోగ్యంపై స్పందించిన నటుడు
- ప్రస్తుతం కోలుకున్నానని వెల్లడి
- శనివారం మద గజ రాజ ప్రీమియర్ కు హాజరైన విశాల్
నటుడు విశాల్ అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. తాజాగా శనివారం జరిగిన ‘మద గజ రాజ’ సినిమా ప్రీమియర్ కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఆయన ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించారు. ఇటీవల ఇదే సినిమా ప్రమోషన్స్ కు హాజరైన సందర్భంలో విశాల్ అనారోగ్యంగా కనిపించడం, ఆయన చేతులు వణకడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. విశాల్ కు ఏమైందంటూ నెట్టింట చర్చ జరిగింది.
ఈ విషయంపై విశాల్ శనివారం స్పందించారు. తాను కోలుకుంటున్నానని, అభిమానుల ప్రేమానురాగాలే తనకు బలమిచ్చాయని చెప్పారు. తాను నటించిన మద గజ రాజ సినిమా ప్రమోషన్స్ వేదికపై విశాల్ మాట్లాడుతూ.. ‘మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే కష్టాలను తట్టుకుని ధైర్యంగా నిలబడుతున్నా. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. ప్రేమతో మీరు పెట్టిన సందేశాలే నన్ను కోలుకునేలా చేశాయి’ అని అన్నారు.