Spadex: ఇస్రో స్పాడెక్స్ డాకింగ్ మిషన్‌లో కీలక ముందడుగు.. మూడు మీటర్ల దూరానికి ఉపగ్రహాలు!

ISRO SpaDex Docking Mission

  • గత నెల 30న ఇస్రో స్పాడెక్స్ ప్రయోగం
  • కొనసాగుతున్న డాకింగ్ ప్రక్రియ
  • డాకింగ్ విజయవంతమైతే ఆ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్
  • భారత భవిష్యత్తు ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం

భవిష్యత్తు ప్రయోగాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. స్పాడెక్స్ ఉపగ్రహాలు చేజర్, టార్గెట్ రెండింటినీ విజయవంతంగా మూడు మీటర్ల దూరానికి తీసుకొచ్చారు. డేటా విశ్లేషణ అనంతరం డాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. గత నెల 30న ఈ మిషన్‌ను ఇస్రో లాంచ్ చేసింది. చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే దీని లక్ష్యం.

ఈ ప్రయోగం విజయవంతమైతే డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద ఉంది. చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడం, అంతరిక్షంలో భారత్ సొంత స్సేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలకు ఈ ప్రయోగం ఎంతో కీలకం. ప్రస్తుతం డాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

More Telugu News