Game Changer: గేమ్ చేంజర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి!

Mega celebrations has begin

  • రామ్ చరణ్-శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్
  • తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్
  • రామ్ చరణ్ నివాసం వద్ద అభిమానుల కోలాహలం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, వసూళ్లు కూడా ఆ రేంజిలోనే వస్తున్నాయి. తొలిరోజున ఈ చిత్రం రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు అంబరన్నాంటుతున్నాయి. 

ఇవాళ హైదరాబాదులోని రామ్ చరణ్ నివాసం ఎదుట అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. డప్పుల మోతలు, ఈలలు, కేకలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. తొలుత బాల్కనీ నుంచి అభివాదం చేసిన రామ్ చరణ్... అభిమానుల ప్రేమాభిమానాలతో గేటు వద్దకు వచ్చి అందరికీ ఆనందం కలిగించారు. తన వాహనాన్ని గేటు వద్దకు తీసుకువచ్చి, అందరికీ కనిపించేలా దానిపైకి ఎక్కారు. గేమ్ చేంజర్ ను సంక్రాంతి విన్నర్ గా నిలిపినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారంటూ సంజ్ఞల ద్వారా స్పష్టం చేశారు. 

కాగా, ఇవాళ రెండో రోజు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఊపందుకోగా, దక్షిణ భారతదేశంలో తిరుగులేని వసూళ్లతో దూసుకుపోతోందని మేకర్స్ తెలిపారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా.... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ కు దాదాపు అన్ని రివ్యూల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. 

ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. ఇందులోని పాటలకు, ఆ పాటలకు శంకర్ ఇచ్చిన విజువల్ ట్రీట్ మెంట్... థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తున్నాయి. రామ్ చరణ్ తన యాక్టింగ్ స్కిల్ ను ఈ సినిమాలో అత్యద్భుతంగా ప్రదర్శించడం అప్పన్న పాత్ర ద్వారా స్పష్టమవుతోంది. ఇక, ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

  • Loading...

More Telugu News