Stalin: రాష్ట్ర గవర్నర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన స్టాలిన్

Stalin comments on TN Governor

  • గవర్నర్ తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరి ఉందన్న స్టాలిన్
  • అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండా వెళ్లిపోయారని విమర్శ
  • రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని వ్యాఖ్య

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత కాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి విమర్శలు గుప్పించారు. తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరి ఉందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని చెప్పారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించలేదని ఆరోపిస్తూ ప్రసంగం చేయకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి. 

Stalin
DMK
  • Loading...

More Telugu News