Nimmala Rama Naidu: చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu fires on YSRCP

  • పోలవరం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్న నిమ్మల
  • పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శ
  • డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిందని మండిపాటు

పోలవరం ప్రాజెక్ట్ ను రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం నేడు సందర్శించింది. వారితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పోలవరంను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని నిమ్మల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలుపెడతామని... 2027 సెప్టెంబర్ కల్లా ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని తెలిపారు. 

2017లో పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు రూ. 800 కోట్ల పరిహారాన్ని అందించారని... ఇప్పుడు మరో రూ. 800 కోట్లకు పైగా నిధులను అందించారని చెప్పారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కాలనీల నిర్మాణం జరగలేదని... బిల్లుల చెల్లింపులు జరగలేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News