Konda Pochamma Sagar: కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి

- హైదరాబాద్ నుంచి కొండపోచమ్మకు వచ్చిన ఏడుగురు హైదరాబాద్ యువకులు
- ఈత కోసం వెళ్లి ఐదుగురి మృతి
- మృతి చెందిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మార్కూర్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు మృతి చెందారు. మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఏడుగురు యువకులు ఈరోజు కొండపోచమ్మ సాగర్‌కు వచ్చారు. వారు ఈత కోసం నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.