gold rate: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!

gold rate today january 11th 2025

  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో బంగారం పది గ్రాముల ధర రూ.80,802
  • వెండి కిలో ధర రూ.93,265

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. ఓ సారి తగ్గితే, మరోసారి పెరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం ధరలతో పోల్చుకుంటే శనివారం భారీగా పెరిగాయి. 

సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ.79,470 ఉండగా, శనివారం నాటికి రూ.1,332 పెరిగి 80,802 కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,020 ఉండగా, శనివారం నాటికి ఏకంగా 3,245 పెరిగి రూ.93,265 కు చేరింది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఈ ధరలు ఉన్నాయి. 

అయితే బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయనేది వినియోగదారులు గమనించాలి. అంతర్జాతీయ మర్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ బంగారం ధర 2,640 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 50 డాలర్లు పెరిగి 2,690 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 30.43 డాలర్లుగా ఉంది.  

  • Loading...

More Telugu News