Chiranjeevi: అందుకు సంతోషిస్తున్నాను.. 'గేమ్ ఛేంజర్'పై చిరంజీవి ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌

Chiranjeevi Interesting Tweet on Game Changer Movie

     


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ప్ర‌ముఖ ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా ఈరోజు ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. 'గేమ్ ఛేంజ‌ర్‌'లో త‌న‌ కుమారుడు రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ద‌క్కుతున్న ప్ర‌శంస‌ల ప‌ట్ల చిరు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
   
"అప్పన్న, రామ్ నందన్ గా రామ్ చరణ్ చాలా బాగా నటించాడని ప్రశంసలు అందుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన ఎస్‌జే సూర్య, అంజలి, కియారా అద్వానీలకు అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు శంకర్, నిర్మాత దిల్ రాజు.. ఒక మంచి పొలిటికల్  డ్రామాకు ఎలాంటి నటులను తీసుకోవాలో అలాంటివారిని తీసుకొని 'గేమ్ ఛేంజర్'ను అందించారు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ చిరు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

More Telugu News