Padi Kaushik Reddy: రూ.500 కోట్లు తీసుకొని గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు అనుమతిచ్చారు: రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

Koushik Reddy hot comments on Revanth Reddy

  • రూ.500 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు
  • బెనిఫిట్ షోలకు అనుమతివ్వమని అసెంబ్లీ వేదికగా చెప్పారన్న ఎమ్మెల్యే
  • గేమ్ ఛేంజర్‌కు ఎలా అనుమతించారని ప్రశ్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిల్ రాజును అడ్డు పెట్టుకొని... సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి... సినిమా పరిశ్రమ నుంచి రూ.500 కోట్లు వసూలు చేసి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

తాము బెనిఫిట్ షోలకు వ్యతిరేకం కాదని, కానీ సీఎం స్వయంగా అనుమతి ఇవ్వమని చెప్పి ఇప్పుడు అనుమతించడంపై ప్రశ్నిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వదని గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వినేలా సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్న పని ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలోనేమో అనుమతి ఇచ్చేది లేదని చెప్పి... ఇప్పుడు రూ.500 కోట్లు తీసుకొని అనుమతించారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. రేవంత్ రెడ్డిది నోరా? మోరా? అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం, మానం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చేది లేదని చెప్పింది రేవంత్ రెడ్డే... ఇప్పుడు డబ్బులు తీసుకొని అనుమతి ఇచ్చింది అతనే అన్నారు.

  • Loading...

More Telugu News