Arvind Kejriwal: ఢిల్లీలో పాతికేళ్లుగా బీజేపీకి అధికారం దక్కలేదు... అందుకే ద్వేషం పెంచుకుంది: కేజ్రీవాల్

Arvind Kejriwal blames BJP

  • ఢిల్లీని బీజేపీ నేర రాజధానిగా మారుస్తోందని ఆగ్రహం
  • దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గ్యాంగ్ వార్‌లు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం
  • మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారన్న కేజ్రీవాల్

పాతికేళ్లుగా బీజేపీకి ఢిల్లీలో అధికారం దక్కలేదని, దీంతో ఇక్కడి ప్రజలపై ఆ పార్టీ ద్వేషం పెంచుకుందని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని నేర రాజధానిగా మారుస్తోందని మండిపడ్డారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్ వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రోహింగ్యా చొరబాటుదారుల పేరుతో పూర్వాంచలి, దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆపార్ట్‌మెంట్లకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నిధులు మంజూరు చేస్తామన్నారు.

Arvind Kejriwal
BJP
AAP
New Delhi
  • Loading...

More Telugu News