Daaku Maharaaj: 'డాకు మహారాజ్' రిలీజ్ ట్రైలర్ చూశారా?.. బాలయ్య అరాచకం అంతే..!
- బాలకృష్ణ, బాబీ కాంబోలో 'డాకు మహారాజ్'
- ఎల్లుండి విడుదల కానున్న సినిమా
- తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల్లో మరింత ఉత్తేజాన్ని నింపేందుకు రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాలయ్య యాక్షన్, బీజీఎం, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రం యూనిట్.. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్‌తో మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. కాగా, ఆదివారం నాడు (ఈ నెల 12న) ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.
తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించారు.
ఇక అనంతపురంలో గురువారం జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తిరుపతి దుర్ఘటన నేపథ్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్.