Upasana: కంగ్రాట్స్ డియర్ హస్బెండ్: ఉపాసన
- 'గేమ్ ఛేంజర్' విడుదల నేపథ్యంలో చెర్రీ భార్య ఉపాసన ట్వీట్
- ప్రతి విషయంలోనూ చరణ్ నిజమైన గేమ్ ఛేంజర్ అన్న సతీమణి
- చరణ్.. అప్పన్నగా ఇరగదీశావ్ అంటూ సాయి దుర్గ తేజ్ ప్రశంస
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెర్రీ సతీమణి ఉపాసన స్పెషల్‌గా ట్వీట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ పలు వెబ్‌సైట్స్ రాసిన రివ్యూలను ఆమె షేర్ చేశారు. "కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలోనూ నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్. లవ్ యూ" అని ఉపాసన రాసుకొచ్చారు.
చరణ్.. అప్పన్నగా ఇరగదీశావ్.. గేమ్ ఛేంజర్‌పై సాయి దుర్గ తేజ్ స్పెషల్ ట్వీట్
మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమాపై సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. "చరణ్.. అప్పన్న పాత్రలో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. నాకు చెర్రీ నటించిన చిత్రాల్లో 'మగధీర'లో హర్ష అండ్ కాలభైరవ, 'ఆరెంజ్'లో రామ్, 'రంగస్థలం'లో చిట్టిబాబు, 'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం. ఈ సినిమాను అందించినందుకు శంకర్‌కు ధన్యవాదాలు" అని సాయి దుర్గ తేజ్ ట్వీట్ చేశారు.