Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

BSE Smallcap index tanks over 6 percent

  • ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లో ముగిసిన సూచీలు
  • లాభాల్లో ముగిసిన ఐటీ షేర్లు
  • నష్టాల్లో ముగిసిన హెల్త్, ఆటోమొబైల్స్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు... రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,389, నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 23,440 వద్ద స్థిరపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ షేర్లు లాభపడ్డాయి. కానీ ఫైనాన్షియల్, హెల్త్, ఆటో మొబైల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 77,500 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 23,450 పాయింట్ల దిగువకు పడిపోయాయి. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో కదలాడిన సూచీలు... మధ్యాహ్నం తర్వాత పూర్తి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 30లో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎన్టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్ లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ స్మాల్ క్యాప్స్ సూచీ 2.85 శాతం నష్టపోయింది. ఈ వారంలో స్మాల్ క్యాప్ 6.5 శాతం క్షీణించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, 5.7 శాతం నష్టపోయింది.

Stock Market
Sensex
Nifty
Business News
  • Loading...

More Telugu News