Income Tax: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు.. మొసళ్లను గుర్తించిన అధికారులు

Income Tax Officers Raid Ex BJP MLA Find Crocodiles At His Home

  • మాజీ ఎమ్మెల్యే పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు
  • సోదాల సందర్భంగా ఇంట్లో మూడు మొసళ్లను గుర్తించిన అధికారులు
  • అటవీ శాఖకు సమాచారం ఇచ్చిన ఐటీ అధికారులు

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. సోదాల సందర్భంగా అధికారులు మూడు మొసళ్లను గుర్తించారు. దీంతో అవాక్కవడం వారి వంతయింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ రాథోడ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

సోదాల సమయంలో రాథోడ్ ఇంట్లోని చెరువులో మూడు మొసళ్లను అధికారులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్లు ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.

  • Loading...

More Telugu News