Swiggy Serves: రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారం పేదలకు... స్విగ్గీ ప్రత్యేక కార్యక్రమం

Swiggy takes new initiative called Swiggy Serves

  • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సామాజిక బాధ్యత
  • స్విగ్గీ సర్వ్స్ కార్యక్రమం ప్రారంభం
  • రెస్టారెంట్లలో ఆహారం వృథా కాకుండా... ఆ ఆహారం పేదలకు అందజేత
  • 33 నగరాల్లో స్విగ్గీ సర్వ్స్ సేవలు

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సామాజిక బాధ్యతతో చేపడతున్న కార్యక్రమం పేరు... స్విగ్గీ సర్వ్స్. రెస్టారెంట్లలో నిత్యం ఎంతో ఆహారం మిగిలిపోతుంటుంది. అలా మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... పేదలకు అందించాలన్న సదుద్దేశంతో స్విగ్గీ నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం స్విగ్గీ... రాబిన్ హుడ్ ఆర్మీ అనే సామాజిక సేవా సంస్థతో చేతులు కలిపింది. 

దీనిపై స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ స్పందించారు. స్విగ్గీ సర్వ్స్ కార్యక్రమాన్ని దేశంలోని 33 నగరాల్లో చేపడుతున్నామని చెప్పారు. దీన్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. తమ కార్యాచరణ వల్ల ఆహారం వృథా అవడం అనే సమస్యే ఉండదని, అటు పేదలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News