Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

ACB Court gives green signal for Revanth Reddy foreign tour

  • ఈ నెల 13 నుంచి 23 వరకు విదేశాల్లో పర్యటించనున్న రేవంత్
  • పాస్ పోర్టును ఆరు నెలల పాటు అప్పగించాలని కోరిన రేవంత్
  • రేవంత్ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్ లకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయన పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేసు నేపథ్యంలో ఆయన తన పాస్ పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించారు. విదేశీ పర్యటనల నేపథ్యంలో తన పాస్ పోర్టును ఆరు నెలల పాటు తనకు అప్పగించాలని కోర్టును కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు... జులై 6వ తేదీ లోగా పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News