Tirupati Stumpede: తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా... అనేది విచారణ జరుపుతున్నాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha reacts on Tirupati stumpede

  • తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట
  • ఆరుగురు భక్తుల మృతి
  • మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఏపీ మంత్రుల బృందం
  • ఘటనలో ఎవరి వైఫల్యం ఉందో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్న అనిత

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రుల బృందం ఈ మధ్యాహ్నం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతి ఘటన ప్రమాదమా, లేక ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనేది విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులకు ఎవరి వైఫల్యం కారణం అనేది సీసీ కెమెరా ఫుటేజి ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనకు కారకులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News