Tollywood: దయచేసి పెద్దమనసుతో నన్ను క్షమించండి: హిందువులకు శ్రీముఖి విజ్ఞప్తి... ఇదిగో వీడియో

Sreemukhi apology to hindus for her comments on lord rama
  • ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అన్న శ్రీముఖి
  • శ్రీముఖిపై భగ్గుమన్న హిందూ సంఘాలు, భక్తులు
  • పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని క్షమించాలంటూ శ్రీముఖి వీడియో విడుదల
హిందువులకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆమెపై భగ్గుమన్నారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తాను పొరపాటున రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించానని క్షమాపణలు కోరుతూ వీడియోను విడుదల చేశారు.

తానూ హిందువునేనని, దైవభక్తురాలిని కూడా అని ఆ వీడియోలో తెలిపారు. అందులోనూ రాముడిని అమితంగా నమ్ముతానన్నారు. కానీ తాను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ జరగకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటానని తెలిపారు.

ఇలాంటి పొరపాటు జరగదని అందరికీ మాట ఇస్తున్నానని, అందరినీ క్షమాపణలు కోరుతున్నానని, దయచేసి అందరూ పెద్ద మనసుతో తనను క్షమిస్తారని వేడుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నారు.
Tollywood
Telangana
Andhra Pradesh
Sreemukhi
Lord Rama

More Telugu News