Harish Rao: తెలంగాణలో 'కింగ్ ఫిషర్' బీర్ల కంపెనీ ప్రకటనపై స్పందించిన హరీశ్ రావు

Harish Rao responds on UB statment

  • రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యూబీ
  • యూబీ నిర్ణయ అనేక ప్రశ్నలకు తావిస్తోందన్న హరీశ్ రావు
  • బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బీర్లను ప్రోత్సహించేందుకేనా అని ప్రశ్న

తెలంగాణలో తన బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రానికి కింగ్ ఫిష‌ర్, హీనెకెన్ బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు యునైటెడ్ బ్రూవ‌రీస్ తీసుకున్న నిర్ణ‌యం అనేక ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

బీర్లకు సంబంధించిన బకాయిలను బేవరేజెస్ కార్పోరేషన్ చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందని, దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలగవచ్చని పేర్కొన్నారు.

తద్వారా బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేదన్నారు.

Harish Rao
Telangana
BRS
  • Loading...

More Telugu News