Nagavamsi: 'గుంటూరు కారం' విషయంలో జరిగింది అదే: నిర్మాత నాగవంశీ

Nagavamsi Interview

  • క్రితం సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం'
  • ఫ్యాన్స్ కి అసంతృప్తిని కలిగించిన కంటెంట్ 
  • అందుకు కారణం చెప్పిన నాగవంశీ 
  • ఎన్టీఆర్ తోను సినిమా ఉంటుందని వెల్లడి  


మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమా చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, క్రితం సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులను పలకరించింది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రమ్యకృష్ణ .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆ సినిమాను గురించి తాజాగా ఎన్ టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడారు. 

'గుంటూరు కారం' అనే టైటిల్ పెట్టడం వలన ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా అని అభిమానులు ఆశించారు. కానీ అది ప్రోపర్ ఫ్యామిలీ సినిమా కావడంతో, వాళ్లంతా డిజప్పాయింట్ అయ్యారు. అప్పటివరకూ వదిలిన కంటెంట్ కారణంగా ఫ్యాన్స్ కథను వేరేగా ఊహించుకున్నారు. వాళ్లు అనుకున్నదానికి దగ్గరగా ఈ కథ లేకపోవడం వలన కొంత నిరాశ చెందారు. మ్యూజికల్ గా మాత్రం బాగా కనెక్ట్ అయింది" అని అన్నారు. 

"ఇక ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉంది. బాలకృష్ణతో ఒక సినిమా చేసిపెట్టమని బాబీని అడుగుతూ వస్తున్నాను. అది ఇప్పటికీ ఇలా సెట్ అయింది. బాలయ్యబాబును ఈ సినిమా కొత్తగా చూపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తోను ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే చెబుతాను" అని అన్నారు. 

  • Loading...

More Telugu News