Kangana Ranaut: బంధుప్రీతికి ఇందిరాగాంధీయే ఉదాహరణ: కంగనా రనౌత్

Kangana Ranaut comments Indira Gandhi

  • ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్ర పోషించిన కంగనా
  • ఇందిర ఘనమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని వెల్లడి
  • పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఎదిగారని వ్యాఖ్యలు

ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా ఇందిరాగాంధీ కుటుంబం, బంధుప్రీతి అంశంపై స్పందించారు. బంధుప్రీతికి సరైన నిదర్శనం ఇందిరాగాంధీయేనని అన్నారు. బంధుప్రీతి కారణంగానే ఇందిర రాజకీయాల్లోకి రాగలిగారని కంగనా వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె అని పేర్కొన్నారు. 

కుటుంబ నేపథ్యం కారణంగా పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నింటినీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు అని వివరించారు. కంగన తాజాగా 'ఎమర్జెన్సీ' అనే రాజకీయ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె ఇందిరాగాంధీగా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ తో కంగనా బిజీగా ఉన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఇందిరాగాంధీపై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News